Naga Shaurya : ఆ గాలి బొక్కల షూ అంత కాస్టా..!
శౌర్య షూ బ్రాండ్ అండ్ కాస్ట్‌తోపాటు సోషల్ మీడియా పేజీల్లో కొన్ని మీమ్స్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
Naga Shaurya: సెలబ్రిటీలు ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటుంది. సినిమా స్టార్స్ ఆఫ్‌స్క్రీన్ లైఫ్ గురించిన విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్టార్స్ ఇళ్ల దగ్గరినుండి పెట్టుకునే ఆర్మమెంట్స్, వాడే వెహికల్స్, గాడ్జెట్స్.. ఇలా ప్రతి విషయానికి సంబంధించిన వార్తలు, వాటి వివరాలు ఆసక్తిగా అనిపిస్తుంటాయి.
The importance isn’t always about the picture, it’s about the message.
Work for it, Earn it, Cherish it.
Whatever May it is! pic.twitter.com/AKYBP9JnNJ— Naga Shaurya (@IamNagashaurya) July 17, 2021
ఇప్పుడు యంగ్ హీరో నాగ శౌర్యకు గురించి న్యూస్ వైరల్ అవుతోంది. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కదా.. రెమ్యునరేషన్ పెంచేసుంటాడు అనుకునేరు. అదేం కాదు.. బాబు వేసుకున్న షూ గురించే న్యూస్.. శౌర్య షూ బ్రాండ్ అండ్ కాస్ట్‌తోపాటు సోషల్ మీడియా పేజీల్లో కొన్ని మీమ్స్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
పాప్ సింగర్, యూత్ ఐకాన్ జస్టిన్ బీబర్, అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ Adidas Yeezy Ararat Sneakers షూస్ వాడారు. రీసెంట్గా నాగ శౌర్య కూడా ఈ లగ్జీరియస్ బ్రాండ్ షూస్‌తో కనిపించాడు. దీంతో జస్టిన్, కాన్యే, రణ్వీర్ పక్కన శౌర్య పిక్ పెట్టి ‘ఆ గాలి బొక్కల షూ అంత కాస్టా..!’ అంటూ జోక్స్ పేలుస్తున్నారు మీమ్స్ రాయుళ్లు.
The search for perfect groom is back on after an unavoidable pause. The team is all rejuvenated and vaccinated as well. #VaruduKaavalenu shoot resumes Today! ?@IamNagashaurya @riturv @LakshmiSowG @ganeshravuri @Composer_Vishal @vamsi84 @NavinNooli pic.twitter.com/6vlOFwwfg5
— Sithara Entertainments (@SitharaEnts) June 24, 2021
సినిమాల విషయానికి వస్తే.. గతేడాది హోమ్ బ్యానర్లో ‘అశ్వథ్థామ’ తో హిట్ కొట్టిన నాగ శౌర్య ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్యతో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ‘వరుడు కావలెను’, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘లక్ష్య’ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వస్తున్న ఫస్ట్ ఫిలిం కావడం విశేషం.
Finally, here I come with a small present to all My Beloved Fans on My Special day?
Lakshya Teaser is out now!
Grateful for all your love?
Hope you all like it♥️???https://t.co/nhY3hAD56F@nseplofficial @SVCLLP @sharrath_marar
@santhosshjagar #Ketikasharma @RaamDop pic.twitter.com/VIAZ3coJL8— Naga Shaurya (@IamNagashaurya) January 22, 2021