Naga Shaurya: నాగశౌర్య నెక్ట్స్ మూవీలో కన్నడ సూపర్ స్టార్.. ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. దీంతో తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని ఓ మల్టీస్టారర్ మూవీగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట నాగశౌర్య.

Naga Shaurya To Team Up With Shiva Rajkumar
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. దీంతో తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని ఓ మల్టీస్టారర్ మూవీగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట నాగశౌర్య.
Naga Shaurya : ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి
దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో నాగశౌర్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుంత ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరోను నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ను ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో నటింపజేస్తే, ఈ సినిమాకు మరింత బలం చేకూరుతుందని వారు భావిస్తున్నారట.
Naga Shaurya : షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన నాగశౌర్య.. హాస్టిటల్‌కు తరలింపు!
ఈ మేరకు శివ రాజ్‌కుమార్‌తో చర్చలు కూడా జరిపారట కార్తిక్ అండ్ టీమ్. అయితే ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిని చూపినా, ఇంకా తన ఫైనల్ నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదట. దీంతో నాగశౌర్య నెక్ట్స్ మూవీలో కన్నడ స్టార్ హీరో నటిస్తాడా లేక వేరొక స్టార్‌ను పట్టుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం నాగశౌర్య ‘‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.