Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’.. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకుంటోంది..

Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

Varudu Kaavalenu

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’..

Gautham : హ్యాపీ బర్త్‌డే లిటిల్ ప్రిన్స్..

అచ్చ తెలుగు టైటిల్ కావడంతో సినిమాపై ముందు నుండి మంచి అంచనాలున్నాయి. మంగళవారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ జెనరేషన్ యూత్ లైఫ్ స్టైల్‌కి దగ్గరగా ఉంది టీజర్. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాని హీరోయిన్.. మొదటి చూపులోనే నచ్చెయ్యడంతో ఎలాగైనా ఆమెనే మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నించే హీరో, యాటిట్యూడ్ ఉన్న హీరోయిన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడతాడు..ఇక కథానాయికకి అందరి అమ్మాయిల్లానే అమ్మ పెళ్లి పోరు.. ఇలా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది టీజర్. నాగ శౌర్య – రీతు వర్మ జంట.. వారి కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి..

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

‘‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుంటుంది.. ఫ్లర్టింగ్‌లో ఏమైనా కోర్స్ చేసొచ్చావా.. మీ బాస్ ఏంటి భయ్యా.. ఎడారిలో ఐస్ తయారుచేద్దామని చూస్తున్నాడు..? ఎవ్‌రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్‌మెన్‌ని చూశావా.. మా వాడు కొడతాడు.. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపైర్‌ని చూశావా.. ఆవిడిస్తది’’.. లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.