Naga Shaurya : క్రిందటి ఉగాదికి అనౌన్స్‌మెంట్.. ఈ ఉగాదికి అప్డేట్.. నాగశౌర్య 22వ సినిమా!
నాగశౌర్య రీసెంట్ గా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా థియేటర్ లో సందడి చేస్తుండగా, నాగశౌర్య తన తదుపరి సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నాడు. కాగా..

Naga Shaurya's 22 movie title announcement on march 22 ugadi
Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గత ఏడాది ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో డీసెంట్ హిట్టుని అందుకున్నాడు. ఇక తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గతంలో తనకి రెండు విజయాలను అందించిన శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మార్చి 17న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Naga Shaurya : నడిరోడ్డులో యువతి పై చెయ్యి చేసుకున్న వ్యక్తిని నిలదీసిన హీరో నాగశౌర్య..
ఇక ఈ సినిమా థియేటర్ లో సందడి చేస్తుండగా, నాగశౌర్య తన తదుపరి సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నాడు. ఈ మూవీని గత ఏడాది ఏప్రిల్ లో ఉగాది కానుకగా అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏడాది తరువాత ఈ ఉగాదికి ఆ సినిమా గురించి అప్డేట్ ఇస్తున్నారు. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. నాగశౌర్య 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ని ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాగశౌర్య లుక్ చూస్తుంటే.. యాక్షన్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ చిత్రాన్ని నాని ‘దసరా’ సినిమా తెరకెక్కిస్తున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ కొత్తవాడు కావడం విశేషం. అలాగే అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నటించే హీరోయిన్ అండ్ ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే తెలియజేయనున్నారు.
ఈ ఉగాదికి ఊరంతా హోరెత్తిపోద్ది 💥
My next – #NS23 Title Reveal on March 22nd marking the auspicious occasion of Ugadi 🔥@PawanBasamsetti @pawanch19 @SLVCinemasOffl pic.twitter.com/LiuT5zVjOd
— Naga Shaurya (@IamNagashaurya) March 20, 2023