వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం.. అశ్వద్దామ టీజర్ అదిరింది

  • Published By: vamsi ,Published On : December 27, 2019 / 07:01 AM IST
వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం.. అశ్వద్దామ టీజర్ అదిరింది

ఛలో సినిమా తర్వాత సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత నటించిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడంలో విఫలం అయ్యాడు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా విజయం సాధించినా కూడా అది నాగ సౌర్య లెక్కలో పడలేదు. ఈ క్రమంలోనే తన సొంత ప్రొడక్షన్‌లో ‘అశ్వథ్థామ’ సినిమాతో పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. 

లేటెస్ట్‌గా విడుదలైన టీజర్ చూస్తుంటే పవర్ ప్యాక్‌డ్ మూవీగా అర్థం అవుతుంది. ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సమంత చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కథ నాగశౌర్యే రాశారు. అశ్వథ్థామ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. అశ్వద్ధామ సినిమాను శౌర్య అమ్మ ఉష మూల్పూరి నిర్మిస్తుండగా.. అతడి నాన్న శంకర్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. జనవరి 31న విడుదల కానుంది ఈ చిత్రం.

‘ఎలా ఉంటాడో కూడా తెలియని ఓ రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం.. సైరన్ కూతలు కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలి అంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి. ఒక అశ్వద్దాముడు రావాలి’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో హీరో నాగశౌర్య ఎంట్రీ ఇస్తాడు. వైజాగ్ సముద్రాన్ని పోర్ట్ ఏరియాని మరియు విలన్ గ్యాంగ్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న సందర్భాలను టీజర్‌లో చూపించారు. అంచనాలు పెంచేలా ఉన్న టీజర్‌పై ఓ లుక్కెయ్యండి.