జనవరి 31న నాగశౌర్య ‘అశ్వథ్థామ’
నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’ విడుదల తేది ఖరారు..

నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’ విడుదల తేది ఖరారు..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’..
ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన వచ్చింది. బుధవారం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2020 జనవరి 31న ‘అశ్వథ్థామ’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. నాగశౌర్య కెరీర్‌లో ‘అశ్వథ్థామ’ ఓ డిఫరెంట్ సినిమా అవుతుందని చెబుతున్నారు మేకర్స్. సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఎడిటింగ్ : గ్యారీ, యాక్షన్ : అన్బరివు, ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నెం.