Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

Naga Shaurya

Naga Shaurya: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వరస సినిమాలు చేస్తున్నాడు. పెద్ద సక్సెస్ నాగశౌర్యను ఊరిస్తోంది. ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో ఒక బంపర్ హిట్ రావాలని నాగశౌర్య ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

తాజాగా నాగశౌర్య బర్త్ డే సందర్భంగా ఐరాక్రియేషన్స్, అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కృష్ణ వ్రింద విహారి అనే టైటిలే కొత్తగా ఉందంటే, ఈ సినిమాలో నాగశౌర్య లుక్ ప్లజెంట్ గా ఉంది. నాగశౌర్యకు జోడీగా షిర్లే షెటియా నటిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడి జానర్లో రానుంది. ఫామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా అనీష్ ఆర్ కృష్ణకు మొదటి సినిమా.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

ఇప్పుడు కృష్ణ వ్రింద విహారితో కలిపి నాగశౌర్య మూడు సినిమాలు చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న పలానా అబ్బాయి, పలానా అమ్మాయి సినిమా మేకింగ్ దశలో ఉంది. ఊహలు గుస గుసలాడే సినిమా తర్వాత వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా పై నాగశౌర్య ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాలవిక అయ్యర్ నటిస్తోంది.

Naga Shaurya: అమ్మాయిలు చాలా టఫ్.. డీల్ చేయడం కష్టమే!

నాగశౌర్య ఊహలు గుస గుస లాడే సినిమాతో హీరోగా వచ్చి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఛలో సినిమాతో హీరోగానే కాదు, ప్రొడ్యూసర్ గా మారి, కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఓబేబి, నర్తనశాల, అశ్వద్థామ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేశాడు. లాస్ట్ మంత్ డిసెంబర్ 10న అర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ కు లక్ష్య అందించాడు. ఆ వెంటనే జనవరి 7న రీతూవర్మతో జతకట్టి వరుడు కావలెను సినిమాను నెల గ్యాప్ లోనే స్ర్టీమింగ్ కి వదిలి, ఓటిటి ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.

Naga Shaurya : ‘కృష్ణ వ్రింద విహారి’ గా నాగ శౌర్య..

ఇక ప్రస్థుతం పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, కృష్ణ వ్రింద విహారి, నారి నారి నడుమ మురారి సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వైవిద్యమైన సినిమాలు చేయడంలో ముందుంటున్నాడు నాగశౌర్య. మరి ఆ ఒక్క హిట్ అంది.. బ్రేక్ దొరుకుతుందో లేదో మరో చూడాలి.