Naga Vamsi : రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు నచ్చలేదంటే చెప్పొచ్చు.. అవతార్ నచ్చలేదని చెప్తే తప్పా??

నాగవంశీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడుగంటలు ఏవేవో చూపిస్తే విజువల్ వండర్ అనాలా? నేను అంతసేపు చూడలేకపోయాను. మన దగ్గర రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్స్ సినిమాలు నచ్చకపోతే మాత్రం ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. ఎవరో మనకి...............

Naga Vamsi : రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు నచ్చలేదంటే చెప్పొచ్చు.. అవతార్ నచ్చలేదని చెప్తే తప్పా??

Naga Vamsi comments on Avatar 2 again

Naga Vamsi :  ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ తో రిలీజయిన అవతార్ 2 సినిమా పెద్ద హిట్ కొట్టి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. అయితే అవతార్ 2 విజువల్ వండర్స్ అని చెప్పినా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ చూపిస్తూ కొన్ని చోట్ల సాగదీసి మరీ మూడు గంటలు ఉండటంతో కొంతమందికి ఈ సినిమా బోరింగ్ గా అనిపించింది. కొంతమందికి అవతార్ 2 నచ్చలేదు కూడా. అయితే టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అవతార్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా చూసి చేసిన ఓ ట్వీట్ వివాదానికి దారి తీసింది.

 

అవతార్ 2 సినిమా రిలీజయినప్పుడు నాగవంశీ ఆ సినిమా గురించి.. త్రీడీలో రిలీజయింది కాబట్టి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అనాలి, విజువల్ వండర్ అంటూ మెచ్చుకోవాలి. లేకపోతే నా సినిమాలని ఆదరించరు అని ట్వీట్ చేశాడు. దీంతో కొంతమంది నెటిజన్లు అవతార్ సినిమానే విమర్శిస్తావా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా బుట్టబొమ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి రావడంతో మరోసారి అవతార్ పై వ్యాఖ్యలు చేశాడు నాగవంశీ.

Pallavi Joshi : కశ్మీర్ ఫైల్స్ నటికి షూటింగ్‌లో గాయాలు.. అయినా షూటింగ్ పూర్తి చేసిన నటి..

నాగవంశీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడుగంటలు ఏవేవో చూపిస్తే విజువల్ వండర్ అనాలా? నేను అంతసేపు చూడలేకపోయాను. మన దగ్గర రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్స్ సినిమాలు నచ్చకపోతే మాత్రం ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. ఎవరో మనకి తెలియని, ఎక్కడో ఉన్న హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన అవతార్ 2 సినిమా నాకు నచ్చలేదని చెప్పడం మాత్రం తప్పా? ఆ సినిమా నాకు నచ్చలేదని చెప్తే వీళ్లేందుకు అంత బాధపడుతున్నారో అర్ధం కావట్లేదు అని కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.