Pawan Kalyan : లోన్‌లతో కూడిన లగ్జరీ లైఫ్.. పవన్ ఆస్తుల వివరాలు చెప్పిన నాగబాబు..

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో బుల్లితెరకు, వెండితెరకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో బిజీ అవుతున్న నాగబాబు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆస్తులు గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Pawan Kalyan : లోన్‌లతో కూడిన లగ్జరీ లైఫ్.. పవన్ ఆస్తుల వివరాలు చెప్పిన నాగబాబు..

Pawan Kalyan : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో బుల్లితెరకు, వెండితెరకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో బిజీ అవుతున్న నాగబాబు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆస్తులు గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు పిల్లల పేరు మీద ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ మనీ తీసి జనసేన పార్టీ కోసం ఉపయోగించారని మేము విన్నాము అది ఎంత వరకు నిజం అని విలేకరి అడిగిన ప్రశ్నకి నాగబాబు బదులిచ్చాడు.

Unstoppable : పవన్ ఫ్యాన్స్‌కి ఇంకొంచెం ముందుగానే పండుగ.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ ముందే రిలీజ్..

కళ్యాణ్ బాబు జీవితం లోన్‌లతో కూడిన లగ్జరీ లైఫ్ లాంటిది. ప్రస్తుతం తన దగ్గర ఉన్న కార్లు అయినా, తను ఉంటున్న ఇల్లు అయినా అన్ని లోన్‌ల మీద ఉన్నవే. తన జీవితంలో తనకంటూ ఏది సంపాదించుకోలేదు. ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కళ్యాణ్ బాబు కానీ తనకి ఉన్న ఆస్తులు కంటే అప్పులు ఎక్కువ. పార్టీ పెట్టినప్పుడు కూడా డబ్బులు లేక పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ మనీ వాడేశాడు. తనకంటూ ఉన్న ఆస్తి ఏమన్నా ఉంది అంటే అది శంకర్ పల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్ మాత్రమే.

తనకి ఫార్మింగ్ చేయడం ఇష్టం. ఎప్పుడో తన కెరీర్ మొదటిలో రూ.8 లక్షల పెట్టి ఇష్టంగా అది కొనుకున్నాడు. అయితే అది కూడా ఒక సమయంలో అమ్మేయబోయాడు. నేనే అడ్డుపడ్డాను. జానీ సినిమా ప్లాప్ అయ్యిన తరువాత డిస్ట్రిబ్యూటర్ లను ఆదుకునేందుకు తనకి ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు. ఆ క్రమంలోనే ఆ ఫార్మ్ హౌస్ కూడా అమ్మేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు నేను అడ్డుపడ్డాను. నువ్వు ఈ ల్యాండ్ ని వ్యవసాయం చేయడానికి ఇష్టపడి కొనుకున్నావు. అంతేగాని డబ్బు సంపాదించడానికి కాదు కదా? అని చెబితే విని అది అమ్మకుండా ఉంచాడు. ప్రస్తుతం తనకి ఉన్న ఏకైక ఆస్తి అది ఒకటే అంటూ తెలియజేశాడు.