Varun Tej : త్వరలో వరుణ్ తేజ్ తన భార్యని పరిచయం చేస్తాడు.. నాగబాబు!

టాలీవుడ్ లో ఉన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సడన్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Varun Tej : త్వరలో వరుణ్ తేజ్ తన భార్యని పరిచయం చేస్తాడు.. నాగబాబు!

Varun Tej

Varun Tej : టాలీవుడ్ లో ఉన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సడన్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా టాలీవుడ్ లోని మరో బ్యాచిలర్ పెళ్ళికి సిద్దమవుతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని మెగా బ్రదర్ నాగబాబు కన్‌ఫార్మ్ చేశాడు. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున.. జేమ్స్ బాండ్ తరహాలో వరుణ్ తేజ్ కొత్త సినిమా..

‘త్వరలోనే వరుణ్ బాబు పెళ్లి జరగబోతుంది. అమ్మాయి ఎవరు అన్నది ఇప్పుడు నేను చెప్పలేను. ఆ అమ్మాయి గురించి, పెళ్లి గురించి వరుణ్ బాబు స్వయంగా ప్రకటిస్తాడు’ అంటూ మెగా అభిమానులకు శుభవార్త చెప్పాడు. అంతేకాదు పెళ్లి తరువాత వరుణ్ తేజ్ సపరేట్ గా వేరే ఇంటిలో కూడా ఉండబోతున్నట్లు కూడా తెలియజేశాడు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఏడాది టాలీవుడ్ లోని మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని కన్‌ఫార్మ్ అయ్యింది.

కాగా వరుణ్ తేజ్ ప్రెజెంట్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘గాండీవధారి అర్జున’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ పోస్టర్ అందరిలో అంచనాలు క్రియేట్ చేసింది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ మరియు ఇతర నటీనటులను ఇప్పటివరకు మూవీ టీం అనౌన్స్ చేయలేదు. త్వరలోనే వీటి గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.