Nagababu : ఆరెంజ్ అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు రీ రిలీజ్ సూపర్ సక్సెస్.. నాగబాబు ఏమన్నాడో తెలుసా?

నాగబాబు ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయడంతో విపరీతమైన స్పందన వచ్చింది. యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టారు................

Nagababu : ఆరెంజ్ అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు రీ రిలీజ్ సూపర్ సక్సెస్.. నాగబాబు ఏమన్నాడో తెలుసా?

Nagababu Reacts on Orange movie re release success

Nagababu :  బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) మూడో సినిమాగా 2010 లో వచ్చిన సినిమా ఆరెంజ్(Orange). ఈ సినిమాని నాగబాబు నిర్మించాడు. ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిజాస్టర్ అయింది. అయితే ఆ కంటెంట్ ఇప్పటి జనరేషన్స్ కి బాగా కనెక్ట్ అయి ఆ తర్వాత ఆరెంజ్ సినిమాకు మంచి ప్రశంసలే వచ్చాయి. ఇటీవల వరుసగా స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సమయంలో చరణ్ ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరారు.

దీంతో నాగబాబు ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయడంతో విపరీతమైన స్పందన వచ్చింది. యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టారు. ముందు ఒక రోజు అనుకున్న రీ రిలీజ్ మూడు రోజులు నడిపించారు. థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా చేశారు. రీ రిలీజ్ లో మాత్రం సూపర్ హిట్ అయింది ఆరెంజ్. కలెక్షన్స్ కూడా దాదాపు 3 కోట్ల వరకు వచ్చాయి.

ఇక ఇటీవల నాగబాబు ఆరెంజ్ రీ రిలీజ్ సక్సెస్ పై మాట్లాడుతూ.. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడేమో సూపర్ హిట్ అంటున్నారు, థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఆ కథ ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అయింది. మేమే ఒక 10 సంవత్సరాలు ముందు ఆలోచించి తీశాము సినిమా. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసుంటే నేను అప్పులపాలయ్యేవాడిని కాదేమో అని అన్నారు. అప్పట్లో ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల నాగబాబు అప్పులపాలయ్యారు. దీంతో ఆరెంజ్ రీ రిలీజ్ సక్సెస్ పై నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Dasara Movie Review : నవమి నాడు మాస్‌ని మెప్పించి ఎమోషన్‌తో ఏడిపించిన దసరా.. నాని యాక్టింగ్, డైరెక్షన్, BGM వేరే లెవల్..

అలాగే దీనిపై ట్వీట్ చేస్తూ .. ఆరెంజ్ రీ రిలీజ్ ని బ్లాక్ బస్టర్ చేసినందుకు ఫ్యాన్స్, ఆడియన్స్ కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా రీ రిలీజ్ లో సపోర్ట్ చేసిన అల్లు అరవింద్, బన్నీ వాసు, సాయి రాజేష్… మిగిలిన వాళ్లందరికీ ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. వాళ్లందరితో పార్టీ చేసుకొని కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు నాగబాబు.