RGV-Nagababu: ఆర్జీవీ నోట నాగబాబు మాట..!

ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్ తగ్గింపు అంశం.. ఏపీ ప్రభుత్వ తీరుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విరుచుకపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకు ట్విట్టర్‌లో..

RGV-Nagababu: ఆర్జీవీ నోట నాగబాబు మాట..!

Rgv Nagababu

RGV-Nagababu: ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్ తగ్గింపు అంశం.. ఏపీ ప్రభుత్వ తీరుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విరుచుకపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకు ట్విట్టర్‌లో ప్రశ్నలు సంధించి దుమారం రేపుతున్నాడు. లేటెస్ట్‌గా యూట్యూబ్ లో ప్రత్యేక్షమై మరో 10 ప్రశ్నలు కూడా వదిలారు. ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా? అంటూనే ప్రభుత్వ విధానాలను విమర్శించారు.

RRR Postpone: ముంచేసిన ఆర్ఆర్ఆర్.. నా తప్పేముందంటున్న జక్కన్న!

ప్రభుత్వమే తక్కువ ధరకు సినిమా తీయచ్చు కదా అంటూ సెటైర్ వేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షామ పథకాల మాదిరే కావాలంటే రేషన్‌ థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చేశాడు. మీకు అర్థం కావడం లేదా? మాకు అర్థం అయ్యేటట్టు చెప్పలేక పోతున్నారా అంటూ ఈ సారీ స్ట్రాంగ్‌ గానే రియాక్ట్‌ అయ్యాడు వర్మ. వర్మ కామెంట్స్, ప్రశ్నలపై సినీ ఇండస్ట్రీ నుండి ఎంతోమంది మద్దతు ప్రకటిస్తుండగా.. వర్మ వీడియోలు, ట్వీట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

OTT Release: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!

కాగా.. వర్మ వ్యాఖ్యలపై తరచుగా పరస్పరం విరుద్ధంగా కామెంట్లు చేసే మెగా బ్రదర్ నాగబాబు కూడా వర్మ కామెంట్స్ మీద స్పందించారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఆర్జీవీ చెప్పింది పూర్తిగా నిజమే అని, తన నోటిలో నుండి వచ్చే ప్రశ్నలను ఆర్జీవీ బయటపెట్టారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.