BiggBoss 6 : బిగ్‌బాస్‌‌లో లవ్ స్టోరీ షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ కపుల్.. అమలతో ప్రేమ ప్రయాణం గురించి నాగార్జున కూడా..

బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా రణబీర్ బిగ్‌బాస్‌‌ కి వచ్చారు. తెలుగులో అందరికి నమస్కారం చెప్పి కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రహ్మాస్త్ర సినిమాని చూడమని చెప్పారు. ఇక ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ లో...........

BiggBoss 6 : బిగ్‌బాస్‌‌లో లవ్ స్టోరీ షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ కపుల్.. అమలతో ప్రేమ ప్రయాణం గురించి నాగార్జున కూడా..

BiggBoss 6 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్‌బాస్‌ 6వ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌ టెలికాస్ట్ మొదలయింది. ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా చేశారు.నాగార్జున ఓ ఎమోషనల్ పంచ్ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు నాగార్జున. బిగ్‌బాస్‌ 6 గురించి ఇంట్రో ఇచ్చి ఆ తర్వాత బిగ్‌బాస్‌‌ హౌస్ మొత్తాన్ని చూపించారు. కంటెస్టెంట్స్ లని స్టేజి మీదకి పిలిచి వాళ్ళ గురించి కూడా పరిచయం చేసి హౌస్ లోకి పంపించాడు. మధ్యమధ్యలో కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్ లని ఏర్పాటు చేశారు.

ఇక బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా రణబీర్ బిగ్‌బాస్‌‌ కి వచ్చారు. తెలుగులో అందరికి నమస్కారం చెప్పి కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రహ్మాస్త్ర సినిమాని చూడమని చెప్పారు. ఇక ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఈ స్టార్ కపుల్ తమ ప్రేమ ప్రయాణం గురించి తెలిపారు. బ్రహ్మాస్త్ర సినిమాకు ముందు మేమిద్దరం మంచి స్నేహితులం, ఈ సినిమా సమయంలోనే మేము బాగా క్లోజ్ అయి మా మధ్య ప్రేమ పుట్టింది, అలా ఈ సినిమాలోనే మా ప్రేమ ప్రయాణం మొదలయి సినిమా రిలీజ్ లోపే పెళ్లి కూడా చేసుకున్నాం అని తెలిపారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్.

BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

అలాగే నాగార్జునని కూడా తన లవ్ స్టోరీ గురించి చెప్పమని అలియా, రణబీర్ అడగగా నాగార్జున అమలతో ఉన్న తన లవ్ స్టోరీని సింపుల్ గా ఒక్కముక్కలో చెప్పేశాడు. శివ సినిమా సెట్లో అందమైన అమలని చూసి ఆమెకి ఫిదా అయ్యాను. ఆ ఆ సినిమా తర్వాత మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు నాగార్జున.