Sirivennela : తెలుసా మనసా పాట పక్కన కూర్చొని రాయించుకున్నా: నాగార్జున

ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలు స్ఫూర్తినిస్తాయి.

10TV Telugu News

Sirivennela : సిరివెన్నెలతో తనకు ఎప్పటినుంచో స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున. హైదరాబాద్ ఫిలించాంబర్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో మాట్లాడారు.

Read This : Sirivennela Seetharama Sastry: తెలుగు జాతికి వన్నెతెచ్చిన మహానుభావుడు – నందమూరి బాలకృష్ణ

“సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అనే వారు. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట… నా కెరీర్ లోనే మరిచిపోలేనిది. ఆ పాటను నేను ఆయన పక్కన కూర్చొని రాయించుకున్నా. ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలు స్ఫూర్తినిస్తాయి. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా పాటలు వినిపిస్తుంటారు” అని నాగార్జున అన్నారు.

Read This : Sirivennela Sitaramasastri : సాహిత్యానికి ఇది చీకటి రోజు – చిరు

×