Big Boss 5 Telugu: హోస్ట్‌గా నాగార్జునే.. మరి కంటెస్టెంట్స్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుంది? అయితే హోస్ట్ ఎవరు.. కంటెస్టెంట్స్ ఎవరు.. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలం ఎండింగ్ లో మొదలయ్యే ఈ షో గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ మాసానికి వెళ్ళింది. ఈ ఏడాది కూడా దాదాపుగా సెప్టెంబరులోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

Big Boss 5 Telugu: హోస్ట్‌గా నాగార్జునే.. మరి కంటెస్టెంట్స్ ఎవరు?

Big Boss 5 Telugu

Big Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుంది? అయితే హోస్ట్ ఎవరు.. కంటెస్టెంట్స్ ఎవరు.. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలం ఎండింగ్ లో మొదలయ్యే ఈ షో గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ మాసానికి వెళ్ళింది. ఈ ఏడాది కూడా దాదాపుగా సెప్టెంబరులోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవగా ఇప్పటికే కొందరి కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది.

కాగా.. కరోనా తగ్గుముఖం పట్టడం.. బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలవనుందనే ప్రచారంతో ముందుగా అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఈ సీజన్ హోస్ట్ ఎవరు. తొలి సీజన్ లో ఎన్టీఆర్ మొదలెట్టిన హవాను నాల్గవ సీజన్ వరకు సీనియర్ హీరో నాగార్జున తనదైన శైలిలో ఆసక్తికరంగా మార్చి ప్రేక్షకులకు చేరువ చేశాడు. అందుకే ఈ సీజన్ కూడా హోస్ట్ దాదాపుగా నాగార్జునను ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం మరింత లావిష్ గా హౌస్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటికి సంబంధించిన పనులు మొదలుకాగా జులైకి ఇది పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

హోస్ట్, హౌస్ ఫిక్స్ అనుకుంటే ఇక మిగిలింది కంటెస్టెంట్స్ ఎంపిక. ఇప్పటికే వీడియో ఆడిషన్ ద్వారా కొందరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుండగా మరికొందరి కోసం సంప్రదింపులు మొదలైనట్లు చెప్తున్నారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ వంటి పేర్లు వినిపిస్తుండగా అధికారికంగా దీనిపై ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు ఒకరిద్దరు స్టార్ స్టేటస్ ఉన్న నటీనటుల కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు వినిపిస్తుంది. అయితే.. తొలి ప్రోమో పడితే తప్ప దీనిపై కొంతైనా స్పష్టత వచ్చే అవకాశం లేదు.