Bigg Boss 5 : యాక్టర్స్ అంటే చిన్న చూపా?? గడ్డి తినమంటే తింటావా??.. కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్

ఇప్పటిదాకా కంటెస్టెంట్స్ గొడవ పడ్డారు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇవాళ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యుల అందరి పైన సీరియస్

Bigg Boss 5 : యాక్టర్స్ అంటే చిన్న చూపా?? గడ్డి తినమంటే తింటావా??.. కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్

Nagarjuna

Bigg Boss 5 :  ఈ సారి బిగ్ బాస్ సీజన్ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ప్రతి రోజు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టె విధంగానే ఉన్నాయి. ఇప్పటిదాకా కంటెస్టెంట్స్ గొడవ పడ్డారు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇవాళ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యుల అందరి పైన సీరియస్ అయ్యారు.

సంచాలక్ తప్పు చేస్తే బిగ్ బాస్ డిస్క్వాలిఫై కూడా చేస్తారు అని సిరిపై సీరియస్ అయ్యారు. ప్రతి సారి ఒట్టేసి చెప్తా అంటావేంటి అని అనీ మాస్టర్ పై సీరియస్ అయ్యారు నాగార్జున. శ్రీరామ్ చంద్ర ఐ యమ జస్ట్ సింగర్ బ్రో అన్నదాన్ని గుర్తు చేస్తూ నామినేషన్స్ టైంలో ఆ స్టేట్మెంట్స్ ఏంటి అని, యాక్టర్స్ అంటే చిన్న చూపా నీకు అని శ్రీరామ్ పై సీరియస్ అయ్యారు. ఇక లోబోని ఉద్దేశించి హౌస్ ప్రాపర్టీ ని పాడు చేయకూడదని తెలీదా అంటే రవి చెప్తేనే చేసాను అని లోబో అనడంతో.. రవి గడ్డి తినమంటే తింటావా అని సీరియస్ అయ్యారు. ఇక శ్వేతా కుషన్ చింపడం రవికి తెలుసు అని అంది. రవి నాకు తెలీదు అన్నాడు. అబద్దాలు చెప్పకు అని శ్వేతా రవిని అనడంతో ఇద్దరూ నాగార్జున ముందే గొడవ పెట్టుకున్నారు. మేము చింపిన కుషన్ కాటన్, బిగ్ బాస్ ఇచ్చిన కాటన్ ఒకటే అని రవి అనడంతో టెస్ట్ చేయమని సిరికి, కాజల్ కి చెప్పాడు నాగార్జున. వాళ్లిద్దరూ ఆ రెండు రకాల కాటన్స్ ని టెస్ట్ చేశారు.

Bigg Boss 5 : జైలుకి వెళ్లిన శ్వేతవర్మ.. అందరి కంటే వరస్ట్ ఈమేనా??

మరి రవి తప్పు చెప్పాడా నిజం చెప్పాడా అంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికి నాగార్జున ఇంటి సభ్యుల మీద బాగా సీరియస్ అయ్యారు ఇవాళ్టి ఎపిసోడ్ లో అని తెలుస్తుంది. మరి దీన్ని కంటెస్టెంట్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.