Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అటు నిర్మాతగా కూడా నాగార్జున సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ....

Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!

Nagarjuna Grabs Karthi Sardar Telugu Rights

Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అటు నిర్మాతగా కూడా నాగార్జున సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన ఓ తమిళ స్టార్ హీరో నటిస్తున్న సినిమాను చేజిక్కించుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఆ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు నాగ్ రెడీ అయ్యాడు.

Nagarjuna : రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో 10వ సినిమా.. మళ్ళీ ఆధ్యాత్మికంగా??

తమిళ యంగ్ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.ఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో కార్తి రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనుండగా, అందులో ఒకటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది.

Simran: ‘సర్దార్’ కి విలన్‌గా సిమ్రాన్..!

ఇక ఈ సినిమాను తెలుగునాట రిలీజ్ చేసేందుకు మంచి ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను నాగ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో రాజీషా విజయన్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా.. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.