Chiranjeevi : హ్యాపీ ఎండింగ్.. చిరు, జగన్ భేటీపై నాగార్జున కామెంట్స్

చిరు జగన్ భేటీపై నాగార్జున మాట్లాడుతూ.. ''చిరంజీవి గారు వెళ్ళారు అంటే తప్పకుండా సిని ఇండస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుంది. చిరంజీవి గారు జగన్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది....

10TV Telugu News

Chiranjeevi :  ఏపీలో సినీ టికెట్ల ధరలపై, థియేటర్ల సమస్యలపై జరుగుతున్న చర్చలు తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరుపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ సినీ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే కొత్త జీవో రిలీజ్ చేస్తారని చెప్పారన్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి భేటీపై హీరో నాగార్జున తాజాగా స్పందించారు.

ఈ మీటింగ్ కి నాగార్జున కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ‘బంగార్రాజు’ సినిమా విడుదల ఉండటం వల్ల వెళ్లలేదని నాగార్జున చెప్పారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘బంగార్రాజు’కి మంచి టాక్ రావడంతో పాటు మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ‘బంగార్రాజు’ సక్సెస్ ప్రెస్ మీట్ ని పెట్టారు నాగార్జున. ఈ ప్రెస్ మీట్ లో సినిమాతో పాటు పలు విషయాలని మాట్లాడారు. చిరంజీవి జగన్ భేటీపై స్పందించారు నాగార్జున.

Pooja Hegde : 2022 మొత్తం పూజా హెగ్డేదే..

చిరు జగన్ భేటీపై నాగార్జున మాట్లాడుతూ.. ”చిరంజీవి గారు వెళ్ళారు అంటే తప్పకుండా సిని ఇండస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుంది. చిరంజీవి గారు జగన్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అన్ని సమస్యల్ని జగన్ గారికి వివరించారు. జగన్ గారు త్వరలో సానుకూలంగా స్పందిస్తారు. చిరంజీవి వెళ్తే సక్సెస్ ఫుల్ గా పని పూర్తి చేసి వస్తారు. త్వరలో సినీ పరిశ్రమకి మంచి జరుగుతుంది” అని అన్నారు.

×