Bangarraju : అభిమానుల్ని పిలవనందుకు క్షమించాలి : నాగార్జున

ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. కరోనా ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహిస్తున్నాము. జనవరి 14....

Bangarraju : అభిమానుల్ని పిలవనందుకు క్షమించాలి : నాగార్జున

Bangarraju :   ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో చిన్న సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి. నాగార్జున కూడా పెద్ద సినిమాలు తప్పుకోవడంతో తన ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ని వేగంగా చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా నిన్న ఆదివారం రాత్రి ‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

Lady Villains: నెగెటివ్ రోల్స్‌‌కి సై అంటున్న అందమైన భామలు!

ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. కరోనా ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహిస్తున్నాము. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు సంక్రాంతికి దుమ్ములేపారు. ఆ చిత్రం కూడా మ్యూజికల్‌ హిట్‌. ఈ సినిమా సక్సెస్‌లో కూడా సగ భాగం మ్యూజిక్‌దే. అందుకే ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్‌ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ సినిమాని తీసుకొస్తున్నాం’’ అన్నారు.