Nagarjuna: నాగ్ కూడా అదే బాటలో.. పీరియాడిక్ కథతో వస్తోన్న కింగ్..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్‌తో నాగ్ అదిరగొట్టినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకనో కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత నాగ్ తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నాడా.. ఆయన ఎలాంటి సినిమాను చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Nagarjuna: నాగ్ కూడా అదే బాటలో.. పీరియాడిక్ కథతో వస్తోన్న కింగ్..?

Nagarjuna To Do A Periodical Subject With Prasanna Kumar

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్‌తో నాగ్ అదిరగొట్టినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకనో కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత నాగ్ తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నాడా.. ఆయన ఎలాంటి సినిమాను చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Nagarjuna: ఏంటి.. నాగ్ ఓకే చేసింది రీమేక్ కథనా..?

కాగా, నాగ్ తన నెక్ట్స్ మూవీని ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ డైరెక్టర్‌గా మారబోతున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న కుమార్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’ మాదిరిగా పీరియాడికల్ మూవీగా రాబోతున్నట్లు తెలిపారు. దీంతో నాగ్ త్వరలో చేయబోయే సినిమా ‘రంగ్ దే బసంతి’ రీమేక్ అనే చర్చ మొదలయ్యింది. కానీ.. దర్శకుడు ప్రసన్న కుమార్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Nagarjuna: మరో కథను ఓకే చేసిన నాగ్.. కానీ డైరెక్టరే లేడట!

నాగ్‌తో తాను చేయబోయేది ఓ పీరియాడికల్ మూవీ అని.. అది ‘రంగ్ దే బసంతి’లా ఉండబోతుందని చెప్పానని.. కానీ ఆ సినిమాకు రీమేక్ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో నాగ్ కూడా త్వరలో పీరియాడికల్ మూవీని తెరకెక్కించబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో పీరియాడికల్ మూవీల సందడి ఎక్కువయ్యింది. ఇప్పుడు నాగ్ కూడా అదే తరహా సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.