అలా నాగ్, అన్నగారి డ్రెస్ వేసుకోవడం జరిగింది!

దేవదాస్(2018)లో నాగ్ ధరించిన అన్నగారి డ్రెస్ వెనుకగల ఆసక్తికర సంఘటనలు..

  • Published By: sekhar ,Published On : May 7, 2020 / 03:36 PM IST
అలా నాగ్, అన్నగారి డ్రెస్ వేసుకోవడం జరిగింది!

దేవదాస్(2018)లో నాగ్ ధరించిన అన్నగారి డ్రెస్ వెనుకగల ఆసక్తికర సంఘటనలు..

కింగ్ నాగార్జున, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి డ్రెస్ వేసుకున్నారు తెలుసా?.. అవును, నాగార్జున, నాని ‘దేవదాస్’ మల్టీ స్టారర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్, ఆకాంక్ష సింగ్‌ని ఫాలో చేసే ఓ సన్నివేశంలో రెట్రో లుక్‌లో స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ వస్తాడు కదా.. అప్పుడు నాగ్ వేసుకుంది అన్నగారి డ్రెస్సే. పెద్దాయనతో సినిమా తీసేటప్పుడు అన్నగారు, మీ గుర్తుగా ఈ డ్రెస్ ఇవ్వండి, దాచి పెట్టుకుంటాను అని నిర్మాత అశ్వినీ దత్ ఓ సందర్భంలో రామారావు గారిని అడగ్గా.. తీసుకోండి బ్రదర్ అంటూ ఆయన ఇచ్చారట.

కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని దత్, నాగ్‌కు చెప్పారట. ‘దేవదాస్’ షూటింగ్ అప్పుడు నాగార్జునకు ఆ సంఘటన గుర్తొచ్చి దత్ గారిని రిక్వెస్ట్ చేయడంతో అన్నగారి డ్రెస్‌లో కింగ్ కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో కాసేపు అన్నగారి డ్రెస్‌లో మెరిశాడు నాగార్జున. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ తన సన్నిహితుల వద్ద చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.