బిగ్ బాస్ ఇంట్లోకి కింగ్ నాగార్జున

  • Published By: veegamteam ,Published On : October 8, 2019 / 06:12 AM IST
బిగ్ బాస్ ఇంట్లోకి కింగ్ నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 3.. దసరా పండుగ సందర్భంగా ఈ రోజు (అక్టోబర్ 8, 2019) ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన గెటప్‌లో బిగ్ బాస్‌ హౌస్‌లో సందడి చేయనున్నాడు. గేమ్ ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో ఈ వీడియో ఉంది. ఎవరిపనుల్లో వాళ్లు ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా మ్యూజిక్ రావటంతో ఇంటి సభ్యులంతా షాకింగ్ గా చూస్తున్నారు.

వెంటనే నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. సోగ్గాడిని చూసిన వెంటనే ఇంటిసభ్యులంతా కలిసి ఎగిరిగంతేశారు. ఇక పన్నెండో వారానికి గాను సోమవారం (అక్టోబర్ 7, 2019)న నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ‘సేఫ్‌ పార్కింగ్‌’అనే టాస్క్‌ ఇచ్చాడు.  

ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్‌ స్థలాలు మాత్రమే ఇచ్చాడు. అయితే సేఫ్‌గా పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారు. అలా పార్కింగ్‌ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్‌ అవుతారు. మొత్తానికి ఈ వారం నామినేషన్ లో వరుణ్, వితికా, రాహూల్, మహేశ్ ఎంపిక అయ్యారు. 

అందులో వితికాకు దొరికిన మెడాలియన్ అవకాశం వాడుకుని నామినేషన్ నుంచి సేఫ్ అయింది. అయితే ఈ రోజు ఎపిసోడ్‌ లో నాగ్ చేసే సందడి చూసేందుకు బిగ్ బాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.