Naga Shaurya : ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేస్తున్న నాగశౌర్య

ఇవాళ నాగశౌర్య రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. నాగశౌర్య, రీతూవర్మ నటించిన 'వరుడు కావలెను' సినిమా గత సంవత్సరం అక్టోబర్ 29న రిలీజ్ అయింది. ఈ సినిమా.........

Naga Shaurya :  యువ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘ఛలో’ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ అతనికి రాలేదు. ఒక్క పెద్ద హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు నాగశౌర్య. వరుస సినిమాలు చేస్తున్నాడే కానీ అవి ఆశించినంతగా విజయం సాధించట్లేదు. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నాడు. ఇవాళ నాగశౌర్య రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

నాగశౌర్య, రీతూవర్మ నటించిన ‘వరుడు కావలెను’ సినిమా గత సంవత్సరం అక్టోబర్ 29న రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేశారు. సిటీలో జరుగుతున్న పెళ్లిళ్లకు వెళ్లి కూడా ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఇవాళ్టి నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Varalaxmi Sarathkumar : టాలీవుడ్‌‌ని వణికిస్తున్న కరోనా.. వరలక్ష్మి శరత్ కుమార్‌కి పాజిటివ్

నాగశౌర్య, కేతిక శర్మ జంటగా వచ్చిన ‘లక్ష్య’ సినిమా గత సంవత్సరం డిసెంబర్ 10న విడుదల అయింది. ఆర్చరీ నేపథ్యంలో తీసిన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. ‘లక్ష్య’ సినిమా కూడా ఇవాళ్టి నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇలా నాగశౌర్య తన రెండు సినిమాలని ఒకే రోజు ఓటీటీలో విడుదల చేస్తున్నాడు.