నాగశౌర్య స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ ప్రారంభం

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా.. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై తెరకెక్కనున్న స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ ప్రారంభం..

  • Edited By: sekhar , October 14, 2019 / 10:10 AM IST
నాగశౌర్య స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ ప్రారంభం

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా.. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై తెరకెక్కనున్న స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ ప్రారంభం..

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా.. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

నాగశౌర్యపై  అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి. ‘ఇదొక స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది. సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని నిర్మాతలు తెలిపారు.

Read Also : జెర్సీ రీమేక్‌లో షాహిద్

‘ఈ చిత్రం ఒక స్పోర్ట్స్‌ డ్రామా. ఒక ఇమాజినరీ బయోపిక్‌లా ఉంటుంది. నాకు తప్పకుండా మైలేజ్‌ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమాలో మీరు సరికొత్త నాగశౌర్యని చూస్తారు’ అన్నారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగోతోంది. సినిమాటోగ్రాఫర్‌ : మనోజ్‌ రెడ్డి, నిర్మాతలు: నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌ మోహన్‌, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.