కీర్తి సురేష్ కొత్త సినిమా ‘గుడ్‌లక్ సఖీ’..

కీర్తి సురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో.. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘గుడ్‌లక్ సఖీ’ టైటిల్ ఫిక్స్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 08:03 AM IST
కీర్తి సురేష్ కొత్త సినిమా ‘గుడ్‌లక్ సఖీ’..

కీర్తి సురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో.. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘గుడ్‌లక్ సఖీ’ టైటిల్ ఫిక్స్ చేశారు..

‘హైదరాబాద్‌ బ్లూస్‌’ ‘డోర్‌’, ‘ఇక్బాల్‌’ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు నగేష్‌ కుకునూర్‌.. ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్స్‌ను ఎంచుకొని సినిమాలు చేయడం తన స్టైల్ అని చెప్పే నగేష్.. మొట్టమొదటసారిగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్‌ కథానాయికగా ‘గుడ్‌లక్‌ సఖీ’ పేరుతో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నగేష్‌ కుకునూర్‌ ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..

‘కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన నేను అనుకోకుండా సినీరంగంలోకి వచ్చాను. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’ చిత్రాన్ని రూపొందించడం నా జీవితంలో కీలక మలుపుగ అని చెప్పొచ్చు. ఆ సినిమాతో దర్శకత్వాన్ని కెరీర్‌గా ఎంచుకున్నా. నేను స్వతహాగా హైదరాబాదీని. ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే హిందీలో ఎక్కువ సినిమాలు చేశాను. ఎట్టకేలకు మాతృభాష తెలుగులో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ‘మహానటి’ సినిమా చూసిన తర్వాత నేను అనుకున్న కథకు కీర్తి సురేష్‌ అయితేనే బాగుంటుందనిపించింది. ఈ సినిమాకు ‘గుడ్‌లక్‌ సఖీ’ అనే టైటిల్ అనుకుంటున్నాం..

Read Also : వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు : ‘పక్కా మాస్’ ట్రైలర్

‘గుడ్‌లక్‌ సఖీ’ క్రీడానేపథ్యంలో సాగే రొమాంటిక్‌ కామెడీ చిత్రం. ఇందులో కీర్తి సురేష్‌ 10 మీటర్స్‌ పిస్టల్‌ షూటర్‌ పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరికి చెందిన ఓ అమ్మాయి షూటింగ్‌లో ఎలా రాణించిందనే అంశాన్ని ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. మహిళా సాధికారత ప్రధానంగా సినిమా కథ సాగుతుంది. జగపతిబాబు, కీర్తి కోచ్‌గా, ఆది రంగస్థల కళాకారుడిగా కనిపిస్తారు. వయోవృద్ధులైన షూటర్స్‌ ప్రకాశీతోమర్‌, చంద్రోతోమర్‌ గురించి 20ఏళ్ల కిత్రం ఓ పేపర్‌లో చూశాను. వాళ్లిద్దరి స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నాను. నా ఈ జర్నీలో ఏం సాధించాననే దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నేను తీసిన సినిమాల్ని కూడా థియేటర్లలో చూడను. రివ్యూలు చూడా చదవను. ఎవరికైనా తమ భావాల్ని వ్యక్తీకరించే హక్కు ఉందని నమ్ముతా. కాబట్టి సమీక్షల మీద చర్చించడం వృథా నా అభిప్రాయం.. తెలుగు వాణ్ణే అయినా.. నాకు తెలుగులో రాయడం, చదవడం రాదు.. ‘గుడ్‌లక్‌ సఖీ’ తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు నగేష్ కుకునూర్.