Radhe Shyam : ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ భలే ఉందిగా..

‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో ‘నగుమోము తారలే‘ కు మంచి రెస్పాన్స్ వస్తోంది..

Radhe Shyam : ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ భలే ఉందిగా..

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకి, ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి చాలా చక్కటి స్పందన వచ్చింది. సోమవారం ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్) విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Aashiqui Aa Gayi : మైండ్ బ్లోయింగ్ మెలోడీ… ప్రభాస్ కెరీర్‌లో చూసి ఉండరు..

హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ‘ఆషికీ ఆగయి’ సాంగ్ అర్జిత్ సింగ్ చాలా చక్కగా పాడారు. సోమవారం సాయంత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో ‘నగుమోము తారలే’ రిలీజ్ చేశారు. మిగతా నాలుగు భాషల్లోనూ జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు.

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

తెలుగు పాటను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడగా.. కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. తెలుగులో ఎలాంటి పదాలు లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తోనే ప్రభాస్-పూజాల కెమిస్ట్రీ చూపించారు. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ‘రాధే శ్యామ్’.