Nakkina Trinadha Rao: ఫ్లాప్‌లతో సతమతమవుతోన్న హీరో.. ధమాకా సక్సెస్ ఇచ్చేందుకు రెడీ అయిన డైరెక్టర్..?

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తనదైన మార్క్ వేసుకుంటున్న దర్శకుల్లో నక్కిన త్రినాథరావు కూడా ఒకరు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరేలా కమర్షియల్ అంశాలతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Nakkina Trinadha Rao: ఫ్లాప్‌లతో సతమతమవుతోన్న హీరో.. ధమాకా సక్సెస్ ఇచ్చేందుకు రెడీ అయిన డైరెక్టర్..?

Nakkina Trinadha Rao All Set To Direct His Next Movie With Naga Shaurya

Nakkina Trinadha Rao: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తనదైన మార్క్ వేసుకుంటున్న దర్శకుల్లో నక్కిన త్రినాథరావు కూడా ఒకరు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరేలా కమర్షియల్ అంశాలతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Trinadha Rao Nakkina : పవన్, బాలయ్యలపై ధమాకా దర్శకుడు కామెంట్స్..

ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కాగా, ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే నక్కిన త్రినాథరావు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ వారితో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈమేరకు వారితో సినిమాను ఓకే చేసినట్లగా సోషల్ మీడియాలో వెల్లడించారు చిత్ర యూనిట్.

Dhamaka: మాస్ రాజా ఫ్యాన్స్‌కు ధమాకా లాంటి న్యూస్.. ఇక ఓటీటీలో రచ్చరచ్చే!

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ తెలియజేయబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య నటించబోతున్నాడనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతోన్న నాగశౌర్యకు అదిరిపోయే హిట్ అందించేందుకే ఈ డైరెక్టర్‌తో సినిమాను ఓకే చేశారట ప్రొడ్యూసర్స్. మరి నక్కిన త్రినాథరావు నెక్ట్స్ సినిమాలో నిజంగానే నాగశౌర్య హీరోగా నటించబోతున్నాడా అనేది అఫీషియల్‌గా తెలియాల్సి ఉంది.