బాలయ్య బర్త్‌డే కౌంట్‌డౌన్ – 106 రోజులు 106 సినిమాలు..

నటసింహా నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా 106 రోజుల ముందుగానే అభిమానుల సందడి..

  • Published By: sekhar ,Published On : February 25, 2020 / 03:53 PM IST
బాలయ్య బర్త్‌డే కౌంట్‌డౌన్ – 106 రోజులు 106 సినిమాలు..

నటసింహా నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా 106 రోజుల ముందుగానే అభిమానుల సందడి..

నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంబరాలు స్టార్ అయిపోయాయి. బాలయ్య పుట్టినరోజు జూన్ 10 కదా అప్పుడే హడావిడి ఏంటనుకుంటున్నారా.. అందరి హీరోలకూ అభిమానులుంటారు భక్తులు మాత్రం మా బాలయ్యకే ఉంటారు అంటుంటారు నందమూరి ఫ్యాన్స్.

రాబోయేది బాలయ్య 60వ బర్త్‌డే కావడంతో రెట్టింపు ఉత్సాహంతో 106 రోజుల ముందుగానే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. ఈ సందర్భంగా బాలయ్య వీరాభిమానులు కర్నాటి కొండలరావు (KKR చౌదరి), (యన్‌.బి.కె. సేవా సమితి అధ్యక్షులు), కొమ్మ విక్రమ్ సింహా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 25 నుంచి జూన్ 10 నాటికి 106 రోజులు.

బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో కలిపి మొత్తం 106 సినిమాలు. ఈ 106 రోజులు రోజుకో సినిమా చొప్పున (ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పిక్స్) సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారు. 106 సినిమాలు, 106 రోజులు.. బాలయ్య బర్త్‌డే సంబరాలు.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే టు బాలయ్య బాబు..