సీఎమ్‌గా బాలయ్య

సీఎమ్‌గా బాలయ్య

బాలయ్యని సీఎమ్‌గా చూపించబోతున్న బోయపాటి.

సీఎమ్‌గా బాలయ్య

బాలయ్యని సీఎమ్‌గా చూపించబోతున్న బోయపాటి.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడవ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని అషీషియల్‌గా అనౌన్స్ చేసారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ, ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్ అయ్యాయి. వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలయ్యకి సింహా లాంటి హిట్ ఇచ్చిన బోయపాటి అంటే, బాలయ్యకీ, నందమూరి అభిమానులకీ ప్రత్యేకమైన అభిమానం.. సింహా, లెజెండ్ సినిమాలకంటే ఒక పది శాతం ఎక్కువ రేంజ్ హిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని బోయపాటి, బాలయ్య ఫ్యాన్స్‌కి ప్రామిస్ కూడా చేసాడు. 

ఇప్పుడీ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సింహా, లెజెండ్ సినిమాల టైపులోనే బాలయ్య ఇందులో కూడా డ్యుయెల్ రోల్ చేస్తున్నాడట. వాటిలో ఒకటి సీఎమ్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం, ఎన్టీఆర్ మహానాయకుడులో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. వినయ విధేయ రామ రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. బోయపాటి, బాలయ్య విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనే మాటకూడా వినబడుతుంది. శ్రీను, బాలయ్యని సీఎమ్‌గా ఎలా చూపిస్తాడో మరి.. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమా, ఫిబ్రవరి రెండవ వారంలో పూజాకార్యక్రమాలతో ప్రారంభంకానుంది.   

×