Balakrishna : శరత్ బాబుకి బాలకృష్ణ నివాళులు.. ఆయనతో కలసి పని చేయడం!

అనారోగ్య సమస్యలతో నేడు కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్ బాబుకి బాలకృష్ణ సంతాపం తెలియజేశాడు. శరత్ బాబుతో కలిసి బాలకృష్ణ బొబ్బిలి సింహం, రక్తాభిషేకం..

Balakrishna : శరత్ బాబుకి బాలకృష్ణ నివాళులు.. ఆయనతో కలసి పని చేయడం!

Nandamuri Balakrishna condolence on Sarath Babu sudden demise

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఏప్రిల్ 21 నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో నేడు (మే 22) హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో తెలుగు సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sarath Babu : శరత్ బాబు, రమాప్రభల కథ ఏంటి.. పెళ్లి అయిందా? సహజీవనమా?

ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న సినిమా ప్రముఖులు శరత్ బాబుకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ కూడా శరత్ బాబుకి నివాళులు అర్పిస్తూ ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు.

“శరత్ బాబు గారు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు గారి మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ వెల్లడించాడు.

Sarath Babu : శరత్ బాబు సినీ ప్రయాణం.. IPS అవ్వాలి అనుకొని!

కాగా బాలకృష్ణ, శరత్ బాబు కలిసి.. బొబ్బిలి సింహం, రక్తాభిషేకం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఆత్మబలం, నిప్పులాంటి మనిషి తదితర సినిమాల్లో నటించారు. శరత్ బాబు 1973లో ‘రామరాజ్యం’ సినిమాతో హీరోగా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో 220 కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. చివరిగా ఆయన నటించిన సినిమా నరేష్, పవిత్రల కాంబినేషన్ లో వస్తున్న తెలుగు సినిమా ‘మళ్ళీ పెళ్లి’.