Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’గా నందమూరి బాలయ్య మనవడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యాడంటున్నారు అభిమానులు.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’గా నందమూరి బాలయ్య మనవడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

Nandamuri Balakrishna Grandson Says Veera Simha Reddy Dialogue

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యాడంటున్నారు అభిమానులు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ట్రైలర్‌లో బాలయ్య పొలిటికల్ డైలాగ్స్..

కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగులతో హోరెత్తించారు. ఇక ఈ వేడుకలో ప్లే చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. బాలయ్య మనవడు ఆర్యవీర్ వీరసింహారెడ్డి సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగును చెప్పుకొచ్చాడు. దానిని బాలయ్య స్వయంగా షూట్ చేయడం విశేషం. ఇక తాత రెడీ యాక్షన్ అనగానే ‘‘భయం నా బయోడేటాలో లేదురా..’’ అంటూ తన డైలాగ్‌ను పూర్తి చేశాడు.

Veera Simha Reddy : ఆ సినిమా చేయాలని నా జీవిత ఆశయం.. బాలకృష్ణ!

ఇలా బాలయ్య మనవడు చాలా క్యూట్‌గా వీరసింహారెడ్డి డైలాగ్‌ను చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాత పోలికలు వచ్చేశాయంటూ నందమూరి అభిమానులు ఈ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.