మాటిచ్చాడు నిలబడ్డాడు.. దటీజ్ బాలయ్య.. మామ బాటలోనే అల్లుడు కూడా..

కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయల చెక్‌ను మంత్రి కేటీఆర్‌కు అందచేసిన నందమూరి బాలకృష్ణ..

  • Published By: sekhar ,Published On : April 3, 2020 / 01:24 PM IST
మాటిచ్చాడు నిలబడ్డాడు.. దటీజ్ బాలయ్య.. మామ బాటలోనే అల్లుడు కూడా..

కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయల చెక్‌ను మంత్రి కేటీఆర్‌కు అందచేసిన నందమూరి బాలకృష్ణ..

 

 

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అలాగే లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం రూ. 25 లక్షల రూపాయలను ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రకటన చేయడమే కాదు.. రూ. 25 లక్షల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. కళ్యాణ్‌కు ఆయన అందించారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం సహాయనిధికి ప్రకటించిన రూ. 50 లక్షల రూపాయల చెక్‌ను తెలంగాణ మినిస్టర్ కేటీఆర్‌కు బాలకృష్ణ అందచేశారు.

Nandamuri Balakrishna handedover a cheque of Rs 50 Lakhs to Minister  KTR

ఈ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కేటీఆర్‌ని అభినందించిన బాలయ్య త్వరలోనే ఏపీ సీఎం జగన్‌కు తాను ప్రకటించిన విరాళాన్ని అందజేస్తామని తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని ఈ సందర్భంగా బాలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ తన వంతుగా రూ.25 లక్షల విరాళాన్ని తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించారు. 

Read Also : క‌రోనా క్రైసిస్‌ : సినీ జర్నలిస్ట్స్‌కి తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేషన్‌ సాయం..