బంగారు బాలయ్య: భయపడకమ్మా నేనున్నా.. సాయం అందించిన జగన్

  • Published By: vamsi ,Published On : November 4, 2019 / 04:16 AM IST
బంగారు బాలయ్య: భయపడకమ్మా నేనున్నా.. సాయం అందించిన జగన్

నందమూరి బాలకృష్ణ.. పేరు వినగానే ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఆయన అభిమానులను కొడతాడు అని కొందరు అంటారు. క్రమశిక్షణలో పెడుతాడు అని మరికొందరు అంటారు. ఇంకొందరు అది ప్రేమ అంటారు. అంతే ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటారు. అయితే బాలయ్యలో కనిపించని మరో కోణం ఒక్కటి ఉంది. ఒక్క మనిషి ప్రాణం కాపాడితే దేవుడంటారు. మరి ఎంతోమంది నిరుపేదల ప్రాణాల్ని కాపాడిన బాలయ్యను ఏమనాలి? బంగారు బాలయ్య అనాల్సిందే.

నందమూరి బాలకృష్ణకి బసవతారకం అనే క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి తరపున పేదలకు తనకు చేతనైన సాయం చేస్తుంటారు బాలయ్య. ఉచితంగా చికిత్స చేయిస్తుంటారు. అయితే ఈ విషయాలను బయటకు రానివ్వరు ఆసుపత్రి నిర్వాహకులు. అయితే లేటెస్ట్‌గా మాత్రం ఓ పత్రికలో వచ్చిన వార్తను చూసి చలించిపోయాడు బాలయ్య. బోన్ కాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలికకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని సోమనాథనగర్‌లో నివాసముంటున్న వెంకట్రాముడు, అరుణ దంపతుల కుమార్తె స్వప్న బోన్ క్యానర్స్‌తో బాధపడుతోంది. వెంకట్రాముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కుమార్తెకు మెరుగైన చికిత్స అందించలేని పరిస్థితిలో వారి కుటుంబం ఉంది. ఆపరేషన్‌కు రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయాలో తెలియక, కుమార్తెను ఆ పరిస్థితిలో చూడలేక ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. అయితే, స్వప్న ధీనగాథపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివారు బాలయ్య.

దీంతో వెంటనే వారి వివరాలు తెలుసుకుని ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. భయపడకమ్మా నీ అన్నయ్యగా నేనున్నా అంటూ బాలిక తల్లికి ధైర్యం చెప్పాడు. ఆపరేషన్‌ చేయిస్తానంటూ హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత అనంతపురం జగన్ వారి టీమ్‌తో కలిసి వారి ఇంటికి వెళ్లి తక్షణ అవసరాలకోసం 15వేల రూపాయలు అందించారు. అలాగే అనంతపురం జిల్లా మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గౌస్ మొద్ధీన్ ఆమెను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. స్వప్నను ఆంబులెన్స్‌లో హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రికి తీసుకుని వచ్చారు.