NBK108: అన్న దిగుతుండు.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులకు ఎసరు పెడుతుండు!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన కెరీర్‌లోని 108వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Nandamuri Balakrishna NBK108 First Look On Ugadi
NBK108: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన కెరీర్‌లోని 108వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.
NBK108: బాలయ్య సినిమాలో జాయిన్ అయిన కాజల్..!
అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుండగా, అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. అయితే ఈ సినిమా నుండి ఉగాది కానుకగా ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా ‘అన్న దిగుతుండు’ అంటూ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే రికార్డులు సెట్ చేసేందుకు బాలయ్య అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా నుండి రాబోతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బాలయ్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.
అన్న దిగుతుండు 🔥
Unveiling the First Look of ‘Natasimham’ #NandamuriBalakrishna garu from #NBK108 on the eve of UGADI ❤️#NBK108FirstLook Tomorrow at 10:15 AM @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens
— Anil Ravipudi (@AnilRavipudi) March 21, 2023