నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన.. కేసిఆర్ గురించి కూడా!

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 01:08 AM IST
నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన.. కేసిఆర్ గురించి కూడా!

టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయి.. నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో చెలరేగిన వివాదం.. సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు కారణం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై లేటెస్ట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించారు.

నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగగా.. “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్‌గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ సమాధానం ఇచ్చారు.

ఇదే సమయంలో కేసీఆర్‌కు తనపై ఎప్పుడూ కోపం లేదని.. పైగా, ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్‌కు తానంటే పుత్ర వాత్సల్యం ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనను రాజకీయపరంగా చూడొద్దని, గతంలో తాను కేసీఆర్‌పై రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు చేశానని, అవి రాజకీయమైనవి మాత్రమే అని అన్నారు. తాను కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచుండకపోతే ఆ విషయమైనా తనతో చెప్పి ఉండాల్సిందన్నారు.

Read More:

 ఈ వారం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లో 10కొత్త సినిమాలు ఇవే!

 సమాధానం చెప్పను, ఎవరికీ భయపడను.. నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన