బాలు కోసం బాలయ్య ప్రత్యేక పూజలు..

10TV Telugu News

Balayya Special Prayers for SPB: ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ‘వైద్యానికి చాలా చక్కగా స్పందింస్తున్నారు, ఫిజియోథెరపీలో కూడా హుషారుగా పాల్గొంటున్నారు.. వైద్యులు ఊపిరితిత్తులు క్లియర్ గా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు’ అని ఇటీవల బాలు తనయుడు ఎస్పీ చరణ్ తెలియచేసిన సంగతి తెలిసిందే.


బాలు కోలు కోవాలని చిత్ర పరిశ్రమ, సంగీత కళాకారులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చిలుకూరు బాలాజీ, శబరిమల ఆలయాల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు అర్చకులు. తాజాగా నందమూరి బాలకృష్ణ, బాలు కోసం ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారనే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలు బావ మరిది, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఆ వివరాలు తెలియచేశారు.


‘బాలకృష్ణ గారు నాకు కాల్ చేసి బాలు గారి గోత్రం, నక్షత్రం అడిగి తెలుసుకుని, రోజూ ఆయన పేరు మీద పూజ చేస్తున్నారు.. అలాగే ప్రతిరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు’’.. అని చెప్పారు సుధాకర్.
స్వతాహా దైవ భక్తుడైన బాలయ్య.. బాలు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తుండడం అభినందించదగ్గ విషయం.. వీరిద్దరు ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించారు.