Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలయ్య నటించిన అఖండ సినిమా వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఆయన నుండి మరో సినిమా రాలేదు. దీంతో ఆయన నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలయ్య నటించిన అఖండ సినిమా వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఆయన నుండి మరో సినిమా రాలేదు. దీంతో ఆయన నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేశాడా..?

ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ సెట్స్‌లో సందడి చేసిన తమిళ హీరో..!

కానీ, అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో, బాలయ్య తన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే తాజాగా బాలయ్య తన సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి, అన్ని సందేహాలను పటాపంచలు చేశాడు. వీరసింహారెడ్డి ఆగమనం జనవరి 12న ఖాయమంటూ తాజాగా ఓ పోస్టర్ ద్వారా కన్ఫం చేశాడు బాలయ్య. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.