Bhagavanth Kesari: బాలయ్య 108వ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ ఇదే.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ

గాడ్ ఆఫ్ మాసెస్, నట‌సింహ నందమూరి బాలకృష్ణ కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Bhagavanth Kesari: బాలయ్య 108వ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ ఇదే.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ

Nandamuri Balakrishna

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్, నట‌సింహ నందమూరి బాలకృష్ణ కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు. షైన్ స్క్రీన్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో సినిమా పేరుతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ ’ అని శీర్షిక ఇచ్చారు. బాలయ్య 108వ సినిమా టైటిట్ ఫవర్ ఫుల్‌గా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న బాలయ్యకు మరో హిట్ ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

NBK 108 : 108 హోర్డింగ్స్ తో బాలయ్య 108 సినిమా టైటిల్ అనౌన్స్.. బాలయ్య బర్త్ డే ముందే సూపర్ ప్లాన్..

ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్100 కోట్ల సూపర్ హిట్ సినిమాలు సాధించారు. ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేసే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ సినిమాలు చేసే బాలయ్య సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టడంతో బాలయ్య అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

 

జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉండటంతో ఆ రోజు టైటిల్ ని ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే అభిమానులకి జోష్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇదిలాఉంటే, ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతం అందించనున్నారు. షైన్‌స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.