Amigos : అమిగోస్ రివ్యూ.. కొంచెం కన్ఫ్యూజ్ చేసినా సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కళ్యాణ్ రామ్..

 బింబిసార సినిమా సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే కొత్త కథతో వచ్చాడు. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో విడుదలైంది. మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..........

Amigos : అమిగోస్ రివ్యూ.. కొంచెం కన్ఫ్యూజ్ చేసినా సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కళ్యాణ్ రామ్..

Nandamuri Kalyan Ram Amigos Movie Review

Amigos :  బింబిసార సినిమా సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే కొత్త కథతో వచ్చాడు. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో విడుదలైంది. మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కథ విషయానికి వస్తే.. సిద్ధూ తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి రిజెక్టు చేస్తుంది. అదే సమయంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారని, వాళ్ళని doppelgangers అంటారని, అలాంటి వాళ్ళని కనుక్కోవడానికి ఓ వెబ్ సైట్ కూడా ఉందని ఎవరో చెప్పడంతో సిద్ధూ ఆ సైట్ లోకి వెళ్లి తన డీటెయిల్స్, ఫోటో అప్లోడ్ చేసి తన లాంటి doppelganger కోసం వెతకగా మంజు పరిచయం అవుతాడు. వీళ్లిద్దరు కలుద్దాం అనుకునే లోపే మైఖేల్ అనే మరో వ్యక్తి కూడా వీళ్ళ లాగే ఉన్నాను అంటూ వీళ్ళని కలుస్తాడు. ముగ్గురు గోవాలో ఎంజాయ్ చేసి తర్వాత సిద్ధూ లవ్ కి హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో వీరి ముగ్గురిలో ఒకరిని NIA వాళ్ళు పెద్ద క్రిమినల్ అని పట్టుకుంటారు. సిద్ధూ ప్లేస్ లోకి మైఖేల్ వెళ్లడంతో, మైఖేల్ ఓ పెద్ద క్రిమినల్ అని ఇద్దర్ని వాడుకొని తన ఉనికి లేకుండా చేసుకుందామని, సిద్ధూ ప్లేస్ లోకి వద్దామని ఫిక్స్ అయినట్టు సిద్ధుకి తెలిసిపోతుంది. అక్కడ్నుంచి సిద్ధూ మంజుని ఎలా కాపాడాడు? మైఖేల్ ని ఎలా చంపాడు? ఈ ప్రాసెస్ లో తనకి ఎదురైన కష్టాలు ఏంటి.. అనేవి తెరపై చూడాల్సిందే.

గతంలో రెండు, మూడు పాత్రల సినిమాలు చాలా వచ్చినా ఇది doppelganger అనే కాన్సెప్ట్ తో రావడం కొత్తగా ఉంటుంది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తాడు. హీరోగా, విలన్ గా, చాలా అమాయకుడు పాత్రలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ అషికా తన అందంతో మెప్పిస్తుంది. బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి గాని.. రీమేక్ చేసినా పాట స్క్రీన్ ప్లేలో అనవసరమైన టైంలో వచ్చినా పాట మాత్రం బాగుంది. బాగా రీమేక్ చేశారు. ఇక స్క్రీన్ ప్లే, స్టోరీ నేరేషన్ బాగుంటుంది. అయితే ముగ్గురు కళ్యాణ్ రామ్ లు ఉండటంతో కొన్ని కొన్ని సీన్స్ లో డైరెక్టర్ ఎంత పకడ్బందీగా రాసిన అక్కడ ఉన్నది ఎవరు అని ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు. తెరపై చెప్పేంతవరకు అక్కడ ఉన్నది ఎవరో తెలీదు కొన్ని సన్నివేశాల్లో. కన్ఫ్యూజ్ అయినా కూడా ఇది మంచి థ్రిల్లింగ్ కూడా ఇస్తుంది. గిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు.

Rajamouli : స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. హాలీవుడ్ వాళ్ళకి కూడా ప్రమోషన్ కి రాజమౌళే కావాలి..

మొత్తానికి అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో విజయం సాధించి కెరీర్ ని ఫుల్ ట్రాక్ లో పెట్టాడు. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఖాతాలో మరో విజయం చేరింది. ఈ వారం పలు చిన్న సినిమాలున్నా ఇదొక్కటే పెద్ద సినిమా అకావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది.