Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

Nandamuri Kalyan Ram Amigos To Stream On This OTT Platform

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Amigos : శేఖర్ కమ్ముల టైటిల్ వాడేసిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాకి పేరు ఎలా పెట్టారో తెలుసా??

కాగా, నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోందని చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ విషయంపై అప్పుడే చర్చ సాగుతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను మరికొన్ని వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోంది.

Amigos : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, అందాల భామ ఆసిక రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.