BIMBISĀRA: పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. బింబిసార హై ఓల్టేజ్ టీజర్

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘బింబిసార’. మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్.

BIMBISĀRA: పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. బింబిసార హై ఓల్టేజ్ టీజర్

Bimbisara (1)

BIMBISĀRA Teaser: నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్న క్యాప్షన్‌తో వశిష్ట్‌ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ లేటెస్ట్‌గా విడుదలైంది.

ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది అంటూ వాయిస్ ఓవర్‌తో సాగిన టీజర్ ఆకట్టుకుంది.

రాజ మందిరంలోని చిన్న నీటి కొలనులో ఉన్న మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్.

బింబిసార టీజర్.. హై ఓల్టేజ్‌లో కళ్యాణ్ రామ్ లుక్స్ గతంలో ఏ సినిమాలో లేనట్లుగా ఉన్నాయి. బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు కళ్యాణ్ రామ్.