Vijayasai Reddy : ఆ బాధ్యత నాది- విజయసాయిరెడ్డికి మాటిచ్చిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తామన్నారు విజయసాయిరెడ్డి.

Vijayasai Reddy : ఆ బాధ్యత నాది- విజయసాయిరెడ్డికి మాటిచ్చిన బాలకృష్ణ

Vijayasai Reddy : నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. నందమూరి, నారా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. తారకరత్న ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్నను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.

ఇక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తారకరత్న పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read..Tarakaratna-Balakrishna : బాలయ్య బాబాయ్ తో నటించాలనే కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న

నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తామన్నారు విజయసాయిరెడ్డి.(Vijayasai Reddy)

”ఉదయం 10 గంటలకు పార్ధివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తారు. 3 గంటలకు పైగా ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉంటాయి. తారకరత్న భార్య అలేఖ్య మానసికంగా సిక్ అయ్యింది. తారకరత్నను అలేఖ్య అత్యంత ఎక్కువగా ప్రేమించింది.

Also Read..Taraka Ratna Number 9 : నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె.. 27న గుండెపోటు, 18న కన్నుమూత..

తారకరత్న మరణం కుటుంబసభ్యులను, అభిమానులను ఎంతో బాధించింది. 39ఏళ్లకే మరణించడం చాలా బాధాకరం. తారకరత్న రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నప్పుడు చనిపోవడం చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరినీ అన్నయ్య, అక్క అనే బంధాలతో పిలిచే వ్యక్తీ తారకరత్న. ఆయనకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు. మొదట కూతురు, తర్వాత కవలలు. అందులో ఒక పాప, బాబు ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశించాం. తారకరత్న ఆసుపత్రి పాలయ్యాక బాలకృష్ణ స్వయంగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు” అని విజయసాయిరెడ్డి చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో జనవరి 28న తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్న శనివారం(ఫిబ్రవరి 18) రాత్రి కన్నుమూశారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు ఓడిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.