Alekhya Reddy Sick : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. అలేఖ్య మానసికంగా సిక్ అయ్యిందని తెలిపారు. తారకరత్నను అలేఖ్య అత్యంత ఎక్కువగా ప్రేమించిందన్నారు.

Alekhya Reddy Sick : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత

Alekhya Reddy Sick : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. అలేఖ్య మానసికంగా సిక్ అయ్యిందని తెలిపారు. తారకరత్నను అలేఖ్య అత్యంత ఎక్కువగా ప్రేమించిందన్నారు.

భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా ఆమె ఆహారం తీసుకోవడం లేదని వెల్లడించారు. దాంతో నీరసించిందని వివరించారు.

Also Read..Taraka Ratna Number 9 : నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె.. 27న గుండెపోటు, 18న కన్నుమూత..

జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో జనవరి 28న తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్న శనివారం(ఫిబ్రవరి 18) రాత్రి కన్నుమూశారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు ఓడిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Also Read..Tarakaratna-Balakrishna : బాలయ్య బాబాయ్ తో నటించాలనే కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న

గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న బ్రెయిన్ కు రక్త సరఫరా ఆగిపోయింది. దాంతో బ్రెయిన్ లో కొంత డ్యామేజీ జరిగింది. ఆ డ్యామేజీని చక్కదిద్దేందుకు డాక్టర్లు కొన్ని రోజుల పాటు చేసిన విశ్వ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారణకు వచ్చిన డాక్టర్లు.. ఆయన మరణించినట్టు శనివారం రాత్రి (ఫిబ్రవరి 18) ప్రకటించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తీవ్ర గుండెపోటుకు గురై సుమారు 23 రోజులు మృత్యువుతో పోరాడిన ఓడిన తారకరత్న అకాల మరణం సినీ, రాజకీయవర్గాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నందమూరి, నారా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మరో 3 రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు. ఇంతలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను మరింత కలిచివేస్తోంది. నందమూరి మోహన కృష్ణ, శాంతి దంపతులకు.. తారకరత్న 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో జన్మించారు. 3 రోజుల్లో ఆయన 40ఏళ్లు పూర్తి చేసుకునే వారు.