Nandini Rai: శవం ముందు నటి డాన్సులు.. నెటిజన్ల ట్రోలింగ్!

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఇలా దాదాపు అన్ని బాషలలో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది నందిని రాయ్. అలా అని ఖాళీగా ఏమీలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ అయినా నందినీ ఇక్కడ భారీ అవకాశాలేమీ అందుకోలేకపోగా వెబ్ సిరీస్ లో.. నారా రోహిత్ లాంటి వారితో సినిమాలలో అయితే నటించింది.

Nandini Rai: శవం ముందు నటి డాన్సులు.. నెటిజన్ల ట్రోలింగ్!

Nandini Rai

Nandini Rai: తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఇలా దాదాపు అన్ని బాషలలో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది నందిని రాయ్. అలా అని ఖాళీగా ఏమీలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ అయినా నందినీ ఇక్కడ భారీ అవకాశాలేమీ అందుకోలేకపోగా వెబ్ సిరీస్ లో.. నారా రోహిత్ లాంటి వారితో సినిమాలలో అయితే నటించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాలతో బిజీగానే ఉన్న నందినీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

దానికి కారణం.. నందినీ శవం ముందు డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించిన నందినీ ఈ సిరీస్‌ షూటింగ్‌ మధ్యలో ఓ పాత చీర కట్టుకుని ధనుష్‌ ‘జగమే తంత్రం’ సినిమాలోని రకిట రకిట పాటకు డాన్స్ ఇరగదీసింది. దీంతో శవం ముందు ఈ డాన్సులేంటి అంటూ నెటిజన్లు తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. అది నిజమైన శవం కాదు.. షూటింగ్లో వేసిన సెట్ మాత్రమే. అది కూడా పోసాని పాత్ర చనిపోయినట్లుగా చూపించే సీన్ కోసం వేసిన సెట్.

అయితే.. కాదేదీ ప్రచారానికి అనర్హం అంటున్నారు కదా ఇప్పుడు.. అందుకే ఈ శవం సెట్ ను వాడుకుంటూ నందినీ డాన్స్ చేసి వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు కొందరు నిజమైన శవం కాదుకదా సరదా కోసమే చేసిన డాన్స్ సూపర్బ్ అంటుంటే.. మరికొందరు మాత్రం శవం ముందు డాన్స్ చేసి వైరల్ చేసుకోవడం అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా నందినీ అనుకున్న వైరల్ అయితే అయిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Nandini Rai (@nandini.rai)