Nani 30: జనవరి 31న పూజా కార్యక్రమాలతో నాని 30 స్టార్ట్..!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే, నాని రీసెంట్‌గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.

Nani 30: జనవరి 31న పూజా కార్యక్రమాలతో నాని 30 స్టార్ట్..!

Nani 30: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే, నాని రీసెంట్‌గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.

Nani 30 : మరోసారి తండ్రి పాత్రలో నాని.. ఆకట్టుకుంటున్న నాని30 గ్లింప్స్!

నాని కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తుండగా, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌పై ఈ సినిమా కథ నడవబోతున్నట్లు ఇప్పటికే ఓ వీడియో గ్లింప్స్ ద్వారా మనకు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో సీతారమం ఫేం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాను జనవరి 31న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Nani: న్యూ ఇయర్ రోజున నాని కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

పలువురు సినీ ప్రముఖలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, వైరా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా లాంచ్‌పై అందరి చూపులు పడ్డాయి. మరి ఈ చిత్ర ప్రారంభోత్సవానికి గెస్టులుగా ఎవరెవరు వస్తారో చూడాలి.