Nani 30 : మరోసారి తండ్రి పాత్రలో నాని.. ఆకట్టుకుంటున్న నాని30 గ్లింప్స్!

నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని కొత్త సంవత్సరం నాడు ప్రకటించాడు. తన కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వీడియో గ్లింప్స్ నేడు విడుదల చేశాడు. ఈ వీడియోలో నాని ఒక పాపతో బిల్డింగ్ పైన కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ పాప..

Nani 30 : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని కొత్త సంవత్సరం నాడు ప్రకటించాడు. తన కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Nani: ‘దసరా’ ముగింపుకు ఫిక్స్ అయిన నాని.. ఇక ఆగేదే లేదట!

కాగా న్యూ ఇయర్ కానుకగా నేడు తన 30వ సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియో గ్లింప్స్ విడుదల చేశాడు. ఈ వీడియోలో నాని ఒక పాపతో బిల్డింగ్ పైన కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ పాప.. ‘నాన్న నీ గడ్డం నచ్చాల’ అంటుంది. దానికి నాని.. ‘ఇది దసరా సినిమా కోసం నాన్న, మన సినిమాకి ఇది ఉండదు’ అంటూ సినిమాలో తన లుక్ గురించి వివరించాడు. అలాగే చిత్ర యూనిట్ ని కూడా ప్రకటించాడు.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కొత్త దర్శకుడు ‘శౌర్యువ్’ ఈ సినిమాని డైరెక్షన్ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘హృదయం’ సినిమాకు సంగీతం అందించిన ‘హేశం అబ్దుల్ వహాబ్’ సంగీతం అందించనున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ పోషించిన నాని.. తన నటనతో అందర్నీ ఏడిపించేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక పాపకి తండ్రిగా నటిస్తూ ఒక బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు