ఊరికే అలా.. జున్నుగాడితో.. వీడియో షేర్ చేసిన నాని..

క్వారంటైన్ : తనయుడు అర్జున్ మూడవ పుట్టినరోజుని ఇంట్లోనే సెలబ్రేట్ చేసిన హీరో నాని..

10TV Telugu News

క్వారంటైన్ : తనయుడు అర్జున్ మూడవ పుట్టినరోజుని ఇంట్లోనే సెలబ్రేట్ చేసిన హీరో నాని..

కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వీడియోల రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు.

ఇక తమ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. పుట్టినరోజు వంటి ఫంక్షన్లతో కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని తనయుడు అర్జున్ (జున్ను) మూడవ పుట్టిన రోజు వేడుకను ఇంట్లోనే జరిపారు. నాని ఐరన్ మేన్ మాస్క్ పెట్టుకుని కొడుకుతో కలిసి సందడి చేశాడు.

తనయుడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పగా.. తండ్రి నాని ముఖాన్ని గిల్లుతూ అర్జున్ అల్లరి చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘ఊరికే అలా.. జున్నుగాడి’తో అంటూ నాని ట్వీట్ చేయగా.. అభిమానులు, నెటిజన్లు జున్నుకి పెద్ద సంఖ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. 

×