Dasara Vs Bholaa : నాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన అజయ్ దేవగణ్.. భోళా కంటే నాలుగు రేట్లు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న దసరా
దసరా సినిమా మార్చ్ 30న పాన్ ఇండియా రిలీజ్ అయింది. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు, హైప్ ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఏకంగా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది దసరా సినిమా......................

Nani Dasara Collections is four times higher than Ajay Devgn Bholaa cinema collections
Dasara Vs Bholaa : గత కొంతకాలంగా సినిమాల విషయంలో, వాటి కలెక్షన్స్ లో సౌత్ సినిమాలు బాలీవుడ్(Bollywood) సినిమాలని బీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ సౌత్ లో చిన్న సినిమాలు, టైర్ 2 హీరోలు కూడా బాలీవుడ్ స్టార్ హీరోల కలెక్షన్స్ ని దాటిస్తున్నారు. ఆల్రెడీ నిఖిల్(Nikhil) తన కార్తికేయ 2(Kaerthikeya 2) సినిమాతో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ దాటించగా ఇప్పుడు నాని(Nani) ఆ పని చేశాడు.
నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దసరా సినిమా శ్రీరామనవమి(Sri Ramanavami) కానుకగా మార్చ్ 30న పాన్ ఇండియా రిలీజ్ అయింది. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు, హైప్ ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఏకంగా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది దసరా సినిమా.
అయితే ఇదే రోజు అజయ్ దేవగణ్ భోళా సినిమా కుడా బాలీవుడ్ లో రిలీజయింది. తమిళ్ కార్తీ ఖైతి సినిమా రీమేక్ గా తెరకెక్కింది భోళా. ఒరిజినల్ సినిమాలో చాలా మార్పులు చేసి ఈ సినిమాని తీశారు. కేవలం హిందీలోనే భోళా సినిమా మార్చ్ 30న రిలీజయింది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. హైప్ కూడా లేకపోవడంతో భోళా సినిమాకు మొదటి రోజు కేవలం 11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోకి మొదటి రోజు 11 కోట్ల గ్రాస్ రావడమంటే తక్కువే. ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువే అయింది.
Dasara Collections : నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్.. అదరగొట్టిన దసరా కలెక్షన్స్..
దసరా సినిమాకు 60 కోట్ల బడ్జెట్ కాగా, భోళా సినిమాకు 100 కోట్లకు పైగా బడ్జెట్ అయింది. అలాంటిది సౌత్ లో టైర్ 2 హీరో నాని తన దసరా సినిమాతో మొదటి రోజు 38 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం 11 కోట్లు కలెక్ట్ చేయడం ఆశ్చర్యం. నాని దసరా సినిమాకు భోళా దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
An action packed Day 1 for Bholaa at the box office🔥
Book tickets now!https://t.co/0DmAm6YmTn#BholaaInCinemasNow#BholaaIn3D @ajaydevgn #Tabu #VineetKumar @imsanjaimishra @raogajraj #DeepakDobriyal @Tarun_Gahlot @TSeries @dreamwarriorpic @RelianceEnt pic.twitter.com/cuqwADcNk0
— ADFFilms (@ADFFilms) March 31, 2023
#Dasara emerges as the #1 MOVIE at the Indian Box Office with a gross of 38 CRORES+ on Day 1 💥💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbusterDasara
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/tD2icNehv5— SLV Cinemas (@SLVCinemasOffl) March 31, 2023