Dasara Collections : రెండు రోజుల్లో దసరా 53 కోట్ల కలెక్షన్స్.. ఇదే కంటిన్యూ అయితే నాని ఫస్ట్ 100 కోట్లు గ్యారెంటీ..
దసరా సినిమా మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. దీంతో నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది దసరా. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో దసరా సినిమా రెండు రోజుల్లో.....................

Nani Dasara Movie Collections cross 50 crores in just 50 days
Dasara Collections : నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా(Dasara). సినిమా రిలీజయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి విజయం సాధించింది. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి భారీ విజయం సాధించింది.
దసరా సినిమా మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. దీంతో నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది దసరా. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో దసరా సినిమా రెండు రోజుల్లో 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా, కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా దసరా నిలిచి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో చిత్రయూనిట్, నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
రెండు రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దసరా సినిమా 53 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇదే కంటిన్యూ అయితే నాని కెరీర్ లో దసరా మొదటి 100 కోట్ల సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీకెండ్ రెండు రోజులు ఉండటం, హిట్ టాక్ రావడం, పాన్ ఇండియా రిలీజ్ కావడంతో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఇంకా ఉంది. ఎలాగైనా ఈ సినిమాతో నాని 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమా సాధించాలని, 100 కోట్ల క్లబ్ లో నిలవాలని ఆశిస్తున్నాడు.
#Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥
53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir— SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023