Dasara Movie Review : నవమి నాడు మాస్‌ని మెప్పించి ఎమోషన్‌తో ఏడిపించిన దసరా.. నాని యాక్టింగ్, డైరెక్షన్, BGM వేరే లెవల్..

స్నేహం కోసం రివెంజ్ తీర్చుకునే మాములు కథ అయినా కథనం, చుట్టూ సంఘటనలు, పరిస్థితులు కొత్తగా పెట్టారు. సినిమా అంతా మందు, బొగ్గు, స్నేహం.. ఈ మూడింటి మీదే నడిపించి ఎమోషన్స్ తో ఏడిపించి, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈలలు వేయించాడు డైరెక్టర్....................

Dasara Movie Review :  నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటం, ముందే సినిమా సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులని మెప్పించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కూడా ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తూ హైప్ పెంచేశాడు. సినిమా పై నాని అండ్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శ్రీరామనవమి(Sri Ramanavami) కానుకగా మార్చ్ 30న నేడు దసరా(Dasara) సినిమా రిలీజ్ అయింది.

 

కథలోకి వెళ్తే.. తెలంగాణ బొగ్గు గనుల మధ్య ఉన్న ఓ చిన్న ఊరు. ఊర్లో ఒక బార్. ఊర్లో మగాళ్లంతా తాగుడికి అలవాటు పడిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ హీరో, హీరోయిన్, ఇంకో ఫ్రెండ్. హీరోయిన్ తన ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని చిన్నప్పుడే తెలిసి హీరో తన ప్రేమని వదులుకుంటాడు. వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేస్తాడు. ఆ బార్ కి సంబంధించి గొడవలు మొదలవుతాయి. విలన్ హీరో ఫ్రెండ్ ని చంపేయడంతో, ఎందుకు చంపాడు, హీరోయిన్ ఏం చేసింది, హీరో విలన్ ని ఎలా ఎదుర్కున్నాడు అనేదే కథ.

స్నేహం కోసం రివెంజ్ తీర్చుకునే మాములు కథ అయినా కథనం, చుట్టూ సంఘటనలు, పరిస్థితులు కొత్తగా పెట్టారు. సినిమా అంతా మందు, బొగ్గు, స్నేహం.. ఈ మూడింటి మీదే నడిపించి ఎమోషన్స్ తో ఏడిపించి, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈలలు వేయించాడు డైరెక్టర్. నాని ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ తో మెప్పిస్తునే ఉంటాడు. ఈ సినిమాలో మాస్ ఎమోషన్ లతో టాప్ లెవల్ యాక్టింగ్ ఇచ్చాడు. చివరి 10 నిముషాలు థియేటర్స్ దద్దరిల్లిపోతాయి నాని యాక్టింగ్ కి. ఇక హీరో ఫ్రెండ్ గా కన్నడ యాక్టర్ దీక్షిత్ కూడా మెప్పించాడు. హీరోయిన్ కీర్తి సురేష్ ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించింది. సముద్రఖని, సాయికుమార్, విలన్ గా మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో, పూర్ణ, ఝాన్సీ, హీరో పక్కన ఫ్రెండ్స్ గా యాక్టర్స్ అంతా మెప్పించారు.

Dasara Movie: దసరా సక్సెస్ సెలబ్రేషన్స్.. సందడి చేసిన నాని, కీర్తి సురేష్!

లొకేషన్స్ అంతా సెట్ అయినా కూడా ఎక్కడా అలా కనిపించదు. కెమెరా వర్క్, ఫ్రేమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలివేషన్స్ షాట్స్ అన్ని బాగుంటాయి. ముఖ్యంగా కొత్త డైరెక్టర్ అయినా కూడా సినిమా అదరగొట్టేశాడు. ఇక మ్యూజిక్, BGM సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులని మెప్పించాయి. నవమి రోజు నాని దసరాతో వచ్చి సూపర్ హిట్ కొట్టేశాడు. అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. మొత్తానికి మరో హిట్ కొట్టేశాడు నాని. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు